శరీరంలో వ్యతిరేక భావాలు రెచ్చగొట్టే వాడినల్ గ్రంధి స్రావకాలు తగ్గి తిరిగి ఎండా ఎండార్షిన్ ల ఉత్పత్తి పెరగాలంటే జీవన వైఖరిని మార్చుకోమంటున్నారు ఎక్స్ పర్ట్స్ శారీరక వ్యాయామాలు మొదలు పెట్టాలి. కాళ్ళు చేతులు కదిలించ గలిగే వ్యాయామం చేస్తే శరీరంలోని అంగాలన్నీ సాధారణ స్థితిలో పనిచేయటం మొదలు పడితే ఇక అనారోగ్య సమస్యలు దూరం అవుతున్నట్లే. అలాగే బాధలో ఉంటే ఒంటరిగా ఉండటం పరిష్కారం కనే కాదు. బాధను పంచుకొంటేనే పోతుంది. మనసులో అలజడి విచారం మూలంగా కీళ్ళనొప్పులు,కండరాల నొప్పులు వస్తాయంటారు వైద్యులు అందుకే మనసును మరల్చే పనులు చేయాలి. శరీరంలో హార్మోన్ లు ఒక సమస్థాయికి రావాలంటే రావాలంటే 30 నిముషాల వ్యాయామం అవసరం. ఆహారం,వ్యాయామం నిద్ర ఈ ముడే ఆరోగ్య సూత్రాలు.

Leave a comment