“వినరో భాగ్యము విష్ణుకథ….
  వెను బలమిదివో…విష్ణు కథ..”

నారదమునీద్రుల వారికి వందనాలు. భూలోకవాసులకు తమ కోరికలు తీర్చే వాడపల్లి వెంకన్నను గోదావరి నది సమీపంలో ప్రతిష్ఠ చేశారు.గోదావరి రెండు పాయలుగా ప్రవహిస్తుంది.ఒకటి గౌతమి రెండు వశిష్ఠ.స్వామి వారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతాయి.

ఇక్కడ వెంకన్నకూ తులసి దళ మాలతో పూజలందుకోవటం ప్రితికరం.స్వామి వారి సన్నిధిలో భక్తులు తమ కోరికలు తీర్చే స్వరూపుడుగా నిత్యం ఆరాధన చేస్తూ ఉంటారు.కర్పూర హరతులు ఎంతో ఇష్టం. భక్తులు తమ మనసులో తలచుకుంటే చాలు ఏదో ఒక రూపంలో ప్రత్యక్ష మై తథాస్తు అని ఆశీస్సులు అందిస్తారు.గౌతమి నదిలో స్నానం చేసి స్వామి వారిని పూజించిన స్వామి వారి కటాక్షం తథ్యం.

ఇష్టమైన రంగుల: అన్ని రంగులు సమ్మతమే నలుపు అనివార్యం.

ఇష్టమైన పూలు : ప్రకృతి లో ఉన్న పువ్వులు అన్ని స్వామి వారి సన్నిధికే.

ఇష్టమైన ముడుపులు: తలనీలాలు ఇవ్వడం,పటిక బెల్లంతో బరువు తూయడం, పొర్లు దండాలు పెట్టడం.

నిత్య ప్రసాదం: కొబ్బరి, పులిహోర, పండ్లు

పులిహోర తయారీ: అన్నం గంజి వార్చితే పులిహోరకి బాగుంటుంది. తగినంత చింతపండు పులుసులో శనగ పప్పు,మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు,పచ్చి మిర్చి, ఆవాలు, పసుపు,తగినంత ఉప్పు వేసి అన్నం కలిపి చివరిగా కర్వేపాకు, వేయించిన జీడి పప్పు లేదా వేరుశనగ గుళ్ళు వేయడమే.

   “ఎందరికి అభయంబు లిచ్చు చేయి…
     కందువగు మంచి బంగారు చేయి”!!

          
        – తోలేటివెంకట శిరీష

Leave a comment