మహిళలతో పోలిస్తే పురుషులే కరోనా తో మరణించే అవకాశాలు ఎక్కువ అంటున్నాయి అధ్యయనాలు .వారిలో ఉండే ఒక కీలకమైన ఎంజైమ్ ఇందుకు కారణం అంటున్నారు.కోవిడ్ -19  తో మరణించిన ప్రపంచ వ్యాప్తి రోగుల గుణాంకాలు  పరిశీలించినప్పుడు మహిళల కన్నా పురుషులు సంఖ్య ఎక్కువ ఉంది .కరోనా లక్షణాలు పురుషుల్లోనే ఎక్కువ తీవ్రంగా ఉండటం, వ్యాధి తీవ్రత కూడా ఎక్కువ గానే ఉండటం గమనించారు  .3500 మంది పురుషులు ,స్త్రీల రక్త నమూనాలు పరీక్షిస్తే, యాంజయో టెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ 2 ఎక్కువగా ఉన్నట్లు తేలింది వైరస్ సోకిన పురుషుల్లో ఈ ఎంజైమ్ పెరిగిపోయి గుండె పైన ఒత్తిడి పెరిగి హార్ట్ ఫెయిల్యూర్ కి దారి తీసిందని పరిశోధకులు చెబుతున్నారు.

ReplyForward

Leave a comment