Categories
వంటకాల్లో రుచి కోసం వెనిగర్ చాలా అవసరం.ఇందులో కొవ్వులు ఉండవు స్పూన్ వెనిగర్ లో రెండు క్యాలరీలు ఉంటాయి. బ్రెడ్ తయారీలో ప్రతి రెండున్నర కప్పుల పిండికి ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ కలిపితే బ్రెడ్ బాగా పొంగుతుంది. కప్పు తాజా పాలలో ఒక స్పూన్ వెనిగర్ కలిపి దాన్ని కదపకుండా నిమిషం ఉంచితే మజ్జిగ తయారవుతుంది.జున్ను ను వెనిగర్ ముంచిన గుడ్డలో చుట్టి డబ్బాలో పెట్టి ఫ్రిజ్ లో ఉంచాలి. చేప పొట్టు త్వరగా వదలాలి అంటే వెనిగర్ రుద్దాలి. పాస్తా అంటుకోకుండా ఉడికించే నీళ్లలో వెనిగర్ వేయాలి కూరగాయలు వెనిగర్ కలిపిన నీటిలో ఉడికిస్తే రుచి బాగుంటుంది. ఉప్పు వేసే అవసరం కూడా లేదు.