వానల్లో చల్లగా హాయిగా చక్కని వాతావరణం ఉంటుంది కానీ,ఇంటి గోడలు టెర్రస్ లు ఫర్నిచర్ మాత్రం పాడాయి పోతాయి. కిచెన్ లో కూరలు తొందరగా కూలిపోతాయి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వానకాలం ఇబ్బందులు ఉండవు. తేమకు లోహంతో చేసిన తలుపులు కిటికీలు తుప్పు పడుతాయి. వాటికీ మెటల్ పెయింటింగ్ సెకండ్ కోటింగ్ వేయించాలి చెక్కతో చేసిన ఫుర్నిచర్,కుషన్లు,దిండ్లు వారానికి ఒకసారైనా శుభ్రం చేయించడం,మార్చడం చేయాలి. ఫంగస్ ఫామ్ అవుతోంది కనుక కిటికీలు తలుపులు తెరిచి ఇల్లంతా గాలి వచ్చేలా చూడాలి. వర్షానికి తడిసిన బట్టలు వెంటనే తుడిచి,కాళ్ళ పట్టాలు మార్చేయాలి. కూరగాయల్ని కాగితం లో చుట్టి ఫ్రిడ్జ్ లో ఉంచాలి. మసాలా దినుసులు వేయించి వాసనా పోకుండా బిగు తైనా మూత ఉన్నా సీసాలో ఉంచాలి. టెర్రస్ పైన నాచు,ఫంగస్ పెరగకుండా వర్షం నీళ్ళు పోయేలా శ్రద్ధ తీసుకోవాలి.
Categories