వర్షకాలపు దగ్గు ,జలుబు వంటి సమస్యలకు గృహవైద్యం మంచి పరిష్కారం. జలుబు తగ్గించటంలో వెల్లుల్లి ముందుంటుంది. వెల్లుల్లి పై పోర తీసేసి నోట్లో ఉంచుకొని కొరుకుతూ దాని రసం మింగుతూ ఉంటే జలుబు తగ్గుముఖం పడుతుంది . ఒక పాయ అయిపోగానే ఇంకో పాయను నెమ్మదిగా కొరుకుతూ తినమంతున్నారు . రోజుకు నాలుగైదు పాయలు ఇలా వాడచ్చు. ముక్కు దిబ్బడ వల్ల ఇబ్బంది పడుతుంటే వేడి వేడిగా మసాలాలు వేసిన ఆహారం తీసుకోమంటున్నారు . ఈ ఆహారంతో మూసుకుపోయిన నాసికా రంద్రాలు తెరుచుకొంటాయి . నోస్ డ్రాప్స్ అవసరం ఉండదు . కాస్సేపు స్పీడ్ గా సరైన వ్యాయామం చేసినా ఫలితం ఉంటుంది . శరీరానికి ఆక్సీజన్ అవసరం కలిగి గాడంగా శ్వాసించటం తో ముసుకు పోయిన నాసికా రంద్రాలు తెరుచుకుంటుంది . దగ్గు వస్తూ ఉంటే ఒక నిమ్మకాయను బాండీలో నూనెలో దానంతట అది రెండుగా విడిపోయే వరకు వేయించి ,దానిరసంలో కాస్త తేనె కలపి తాగితే దగ్గు తగ్గుముఖం పడుతుంది.

Leave a comment