కొత్తగా తల్లులయిన మహిళలు పిల్లల నిద్రవేళ గురించి కంగారు పడతారు. బిడ్డ రాత్రివేళ నిద్ర పోవాలని కోరుకుంటారు.స్లీప్ మెడిసిన్ జర్నల్ లో వచ్చిన ఒక అధ్యాయం అందరి పిల్లల నిద్రవేళ లు ఒకటిగా ఉండవని తేల్చింది.44 మంది పిల్లల నిద్రవేళ ను రెండు వారాలపాటు రికార్డ్ చేసిన ఈ అధ్యయనంలో చిన్న పిల్లలు ఎదిగే క్రమాన్ని బట్టి నిద్రవేళ ఉంటాయని పిల్లలకు తల్లులు సరిపోవు పాలు ఇచ్చి వారి పక్కనే నిద్రించటం వల్ల  పిల్లలు చక్కగా నిద్రపోయే అవకాశం ఉందని తేలింది.  పుట్టిన మొదటి ఆరు నెలలో పెరుగుదల బాగా కనిపిస్తుందని నిద్ర వేళల్లో మార్పులు ఉంటాయని తల్లులు ఈ విషయంలో గాబరా పడనవసరం లేదని వివరించింది.

Leave a comment