ఏషియన్ గేమ్స్ లో 100 మీటర్ల పరుగులో మనదేశానికి 2 రజతాలు సాధించింది ద్యుతి చంద్. అత్యంత వేగవంతమైన క్రీడాకారిణిగా రెండవ స్థానంలో నిలబడింది. ఒరిస్సాలోని చాకో గోపాల్ పూర్ అనే చిన్న గ్రామం నుంచి వచ్చింది ద్యుతి. కనీస వసతులు కూడా లేని గ్రామం అది. కడుపు నిండా అన్నం కూడా లేని కుటుంబం చిన్నప్పుడే ఆటల్లో ముందు వచ్చే ద్యుతి పరుగు పందాల పైన దృష్టి పెట్టి రాష్ట్ర జాతీయ స్థాయిలో పోటిపడి పాటియాలా శిక్షణా శిబిరానికి ఎంపికైంది. ఆమెకు పుల్లెల గోపిచంద్ ప్రోత్సహం లభించింది. భువనేశ్వర్ లో బిజినెస్ లా చదువుతున్న ద్యుతి ఎంతో కష్టపడి ఈ స్థాయికి ఎదిగింది. క్రిడాకారిణిగా ఇప్పుడు అందరు పొగడ్తలు అందుకుంటుంది. ఒక కుగ్రామం నుంచి వచ్చిన ద్యుతి చంద్ ఇప్పుడు ప్రపంచస్థాయి సెలబ్రిటీ.

Leave a comment