మాంసం పోషక విలువలున్న ఆహారమే కానీ పర్యావరణానికి హానికరం అందుకే మాంసాహారానికి ప్రత్యామ్నాయం గురించి ఆలోచించి పెసర, సోయా, బఠానీ, పుట్టగొడుగులు బియ్యం వంటి పదార్థాలతో శాకాహార మాంసాన్ని తయారు చేయిస్తున్నాం అంటోంది సినీ నటి జెనీలియా భర్త నితీష్ తో కలిసి ముంబై లో ఇమేజిన్ మీట్స్ అనే సంస్థను నడుపుతోంది అమెరికాకు చెందిన ఏ డి ఎం భాగస్వామ్యం తో వృక్ష ఆధారిత ఉత్పత్తులను తీసుకొచ్చింది. సాధారణ మాంసంలో లభించే ప్రొటీన్లు, కొవ్వు, కార్బోహైడ్రేట్లు, పీచు పదార్థాలు శాకాహారం మాంసం లో లభిస్తాయి. సోయా, ఈస్ట్ నుంచి తీసిన సారం ఉల్లి, వెల్లుల్లి, మిరియాలు కలిపి మాంసం రుచిని తెస్తాయి ఇప్పుడీ శాకాహార మాంసానికి ఎంతో డిమాండ్ ఉంది.

Leave a comment