కాయితాలు,పేక ముక్కలు,గాజుతో కళాకృతులు చేయటం చూశాం. కానీ చెట్ల వేర్లతో వస్తువులు జంతువుల ఆకారాలు చేశారు కళాకారులు . ఫ్రాన్స్ లోని మిలియన్ అండ్ వన్ రూట్స్ మ్యూజియం కు వెళితే ఎక్కడ చుసిన విచిత్రమైన ఆకారాల్లో వుండే చెట్లు వేర్లు రకరకాల ఆకారాల బల్లలు అలంకరణ వస్తువులు కనిపిస్తాయి. ఇదంతా మిబెల్ మారిస్ ద్రుష్టి ఒకానొక ఆక్టోపస్ గా కనిపించిన ఒక వేరు చూసి కొన్ని మార్పులు చేసి అచ్చం ఆక్టోపస్ రూపం లోకి తెచ్చేశాడట . ఇక అప్పటి నుంచి అడవుల్లో కనిపించే ప్రతి వేరును సేకరించి చిన్న చిన్న మార్పులతో ఎన్నో కళాఖండాలు సృష్టించాడు . ఇంత వరకు 800 వేర్లతో బోలెండని కళాకృతులు సృష్టించాడు. ఈ వేర్ల మ్యూజియం చూసేందుకు ఎంతో మంది వస్తారట.

Leave a comment