ఇవ్వాల్టి యువతరం చాలా చురుకైన వాళ్ళు దేన్నైనా సరే యూట్యూబ్ ఒపెన్ చేసి గూగుల్ సెర్చ్ చేసి తెలుసుకొంటారు. వంటైనా ఇంతే ఏ రుచి కావాలన్న ఒక్క నిమిషంలో తయారీ విధానం తెలుసుకొవచ్చు. అరగంటలో రుచి చూడవచ్చు కూడా. అయితే వచ్చిన చిక్కల్లా తిరగమాతో వేయాలంటే చేతులపైన నూనె ఆవాలు చింది పడతాయి. అలాగని వదిలేస్తే మాడి ఊరుకొంటాయి.అందుకే కొత్తగా వంటింటి ప్రవేశం చేసే ఈ తరం కోసం స్ల్పాటర్ స్క్రీన్ మూతలు వచ్చాయి. ఇవి హాండిల్ తో జల్లెడలాంటి మెష్ తో ఉంటాయి. తిరగమూత వేసిన బాండీ పైనో గిన్నెపైనో ఇవి మూత పెట్టేస్తే నూనె చింది చేతులపైన పడకుండా ఉంటాయి.

Leave a comment