నీహారికా,

మనం నిముష నిముషం గుర్తు తెచ్చుకోవలసిన విషయం ఒకటుంది. జీవితాన్ని ఆనందంగా గడపాలంటే, మనిషి జీవితం సంతోషమయం కావాలంటే ఏం చేయాలి. మనిషి ముందర సంతృప్తిగా జీవించాలి. ఆ సంతృప్తి ఎక్కడ దొరుకుతుందీ అని అన్వేషిస్తే ఇవ్వడంలో అని తేలిందట. అవును ఎవరో సినిమా కవి చెప్పినట్లు “ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటనూ లేనేలేదని” మనకున్నదానిలో ఎదుటి మనిషికి ఏదైనా ఇవ్వడం, సాయం చేయడంలో కలిగే తృప్తి వర్ణించతరం కాదని తేలింది. నిజమే మనకి సంతృప్తి వుండదు. ఎంత సంపాదించినా ఇంకా కావాలి. ఎన్ని కోర్కెలు తీరినా ఇంకో కోరిక పుట్టుకొస్తుంది. మన దగ్గర లేనిది ఇంకెవరి దగ్గరో ఉందనిపిస్తుంది. ఈ సంపాద ఝoఝాటంలో పడికొట్టుకుపోవడం మనిషి లక్షణం. అందుకే కుబేరులైనా బిల్ గేట్స్, వారెన్ బఫెట్ వంటి వారు దాతృత్వంలో, ఇవ్వడంలో వాళ్ళ ఆనందానికి మూలాలున్నాయని తెలుసుకొన్నారు. సంపాదిస్తారు, ఇస్తూనే ఉంటారు. ఆ రకంగా వాళ్ళు సంతృప్తులైనారు. సంతోషంగా జీవిస్తున్నారు. రెండు చేతులా సంపాదించాలి, రెండు చేతులా ఇవ్వాలి కూడా. ఈ కాన్సెప్ట్ బావుంది కదూ.

Leave a comment