Categories
పేదరికం కారణంగా ఎన్నో సార్లు చదువు ఆపవలసిన సందర్భాలు వచ్చాయి కానీ నేను వెనక్కి తగ్గలేదు ఢిల్లీ లోని జె ఎన్ టి యు లో చదువుకోవటం నా ధ్యేయం బి.ఏ మొదటి సంవత్సరం నుంచి కష్టపడి ప్రిపేర్ అయ్యాను. ఎం ఏ హిందీ లో నాకు సీటు వచ్చింది. జె ఎన్ టి యు నాకు సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది అంటుంది సరిత మాలి. ముంబై లోని ఘడ్కోపర్ మురికివాడ లో పుట్టి పెరిగిన సరిత అక్కడే స్కూల్లో చదువుకుంది. ట్యూషన్స్ చెబుతూ డబ్బు దాచుకుని చదువుకుంది. జె ఎన్ టి యు లో ఎం.ఫిల్ పూర్తి చేసిన సరిత కు తాజాగా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లో పీహెచ్ డి చేసే అవకాశం వచ్చింది. భవిష్యత్లో పేద పిల్లలకు సహాయం చేద్దాం అనుకుంటున్నాను అంటుంది సరిత మాలి. ముంబై లో పేవ్ మెంట్ల పైన పూలు అమ్మిన రోజులు నేను మరచిపోను. బహుశా ఆ రోజులే నాకు స్ఫూర్తి అంటుంది 28 ఏళ్ల సరిత.