నన్నారి తీగ నుంచి భూమిలోకి పాకే వేర్ల తో తయారు చేసే  ఔషధం  రాయలసీమ ప్రత్యేకం. ఇక్కడ మాత్రమే లభించే నన్నారి పానీయాన్ని ఆరోగ్య సంజీవిని అంటారు.నన్నారి షర్బత్ ని శాస్త్రీయంగా తయారు చేస్తున్న ఏకైక ప్లాంట్ ని చిత్తూరులోని ఏపీ గిరిజన కార్పొరేషన్ నిర్వహిస్తోంది.ఈ వెళ్లలో కిడ్నీలో రాళ్ళని కరిగించే శక్తి ఉంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. మూత్రనాళ వ్యాధులను నయం చేస్తుంది.గ్లాసులో రెండు స్పూన్ల నన్నారి పానీయం పోసి నిమ్మకాయ పిండి సోడా కలిపితే నురుగులు గక్కే నన్నారి పానీయం తయారవుతుంది. తీపి వగరు పులుపు తో ఈ నన్నారి అడవి వేర్లతో తయారు చేసే అరుదైన పానీయం.

Leave a comment