సంచార జాతుల అభ్యున్నతి మిత్తల్ పటేల్ లక్ష్యం చిరునామా అంటూ లేని వేలమంది సంచార జాతుల వారికి గుర్తింపు కార్డు,అడ్రస్,ఏర్పాటు చేసింది మిత్తల్. గుజరాత్‌ విద్యాపీఠ్‌లో జర్నలిజం చేసి ఫెలోషిప్‌లో భాగంగా బార్డోలి గ్రామానికి వెళ్లిన మిత్తల్ కు ఓ సంచార తెగ కనబడింది. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తిరిగే సంచార జాతులు ఒక్క గుజరాత్ లోనే 40 రకాలున్నారు ముప్పయ్ నుంచి 40 లక్షల వరకు జనాభ వుండే ఈ సంచారా జాతులకు ఆధార్‌ కార్డు, ఓటరు కార్డు, జనన ధ్రువీకరణ, చిరునామా  ఏవీ లేవని తెలిశాక మిత్తల్ వాళ్లకోసం పని చేయాలనుకొంది.2015 విచారత కమ్యునిటీ పేరిట ఎన్జీవోను ప్రాంభించింది.1400 సంచార జాతుల కుటుంబాలకు పక్క ఇల్లు,మూడు హాస్టల్స్ నిర్మించింది. వందల కొద్ది పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు. 2017లో మిత్తల్ కు ‘నారీ రత్న’ అవార్డు లభించింది.

Leave a comment