అశ్వదళం బ్రిటిష్ హయాం నుంచి ఉన్న 1926 నుంచి మెరీనా బీచ్ గస్తీ కి ఉపయోగిస్తున్నారు. 2011 వరకు ఎవ్వరూ మహిళలు లేరు. బహుశా నేనే మొదటిదాని కావచ్చు అంటుంది సుకన్య. కోయంబత్తూర్ కు చెందిన సుకన్య అశ్వదళం లో చేరింది. గుర్రం ఎక్కి మెరీనా బీచ్ లో వాకింగ్ కు విహారానికి వచ్చే వారిని అదుపు చేయటం కాపాడటం ఆమె డ్యూటీ. మెరీనా బీచ్ సుదీర్ఘంగా ఉంటుంది. గుర్రం ఎక్కి తిరగడం కాస్త తేలికే ఆరేడు గంటల పాటు గుర్రం పైన తిరుగుతూ డ్యూటీ చేస్తుంది సుకన్య. అశ్వదళం లో ఇప్పుడు ఐదుగురు మహిళా పోలీస్ లో పనిచేస్తున్నారు. వారి ప్రధాన డ్యూటీ మెరీనా బీచ్ ను కాపాడటం.

Leave a comment