ఖరీదైన సెంట్లు కొన్నాక కొద్ది కాలనికే అంత వాసన నాణ్యత ఉందనిపించదు .వాటిలో నాణ్యత పోకుండా ఉండాలంటే చల్లని పొడిగా ఉండే పడకగదిలోనో కిటికీలకు దూరంగా ఉంచాలి. తేమగా ,వేడి ఎక్కువగా ఉండే చోట ఉంచరాదు.ఎక్కవ సమయం పాటు ఈ సువాసన నిలిచి ఉండాలంటే పల్స్ పాయింట్ పైన రాసి ఆ తర్వాత సెంట్ స్ర్పే చేస్తే ఎక్కువ సేపు ఉంటుంది. నూనె చర్మం సువాసన ఎక్కువ సేపు పట్టి ఉంచుతుంది.ముందుగా పొడి చర్మంపైన మాయిశ్చరైజర్ అప్లై చేసి సెంట్ చల్లితే చాలా సేపు శరీరంపైన సువాసన నిలిచి ఉంటుంది. స్నానం చేసిన వెంటనే చర్మం ఆరిపోయే లోపలే ఈ సెంట్ రాసుకొంటేనే ఎక్కువ సేపు ఈ పరిమళం ఉంటుంది.

Leave a comment