వయస్సు పెరుగుతున్న కొద్దీ శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి . 30 ఏళ్ళు వచ్చేసరికి పెదాల ష్రిమ్కింగ్ మొదలవుతుంది. ఎదిగే కొద్దీ కొలాజెన్ ఉత్పత్తి తక్కువవుతుంది. కొలాజెన్ వల్లనే పెదవులు తేమతో నిగనిగలాడతాయి. సూర్య కిరణాలు కూడా కొలాజెన్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. అంచేత ఎండలోకి వెళ్లేప్పుడు సన్ స్క్రీన్ లోషన్ పెదవులకు కూడా రాసుకోవాలి. పాతిక సంవత్సరాల వయస్సులో మూత్రాశయంలో ద్రవాన్ని ఎంతసేపైనా ఆపి ఉంచుకునే శక్తి ఉంటుంది. 65 సంవత్సరాలు వస్తే మూత్రాశయం ఆ శక్తి పోగొట్టుకుంటుంది . అంచేత బ్లాడర్ నియంత్రణను మెరుగు పరుచుకునేందుకు పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్ సైజులు సహకరిస్తాయి కనుక ముందునుంచే ఏ ఎక్సర్ సైజులు ప్రారంభించాలి . అలాగే వయసు తో పాటే సాగిపోయే చర్మం విషయంలో దెబ్బతినే పలువరస విషయంలో శ్రద్ధ తీసుకుని తీరాలి . రాబోయే వార్ధక్యాన్ని ఆపలేకపోవచ్చు . కానీ ఆరోగ్యంగా ఉంచుకునే పద్ధతులను విస్మరించవద్దు.
Categories