అక్టోబర్ వచ్చింది అంటే చెన్నయ్ దగ్గరలోని వేదాంతంగల్ సరస్సు వేలాది పక్షులకు విడిది అయిపోతుంది లెక్కలేనన్ని పక్షులు కిలకిలా రావాలతో ఆ ప్రాంతం మనసు పరవశింపజేస్తుంది . ఈ 74 ఎకరాల బర్డ్ శాంక్టురీ సమీపంలో కిరికిల్లి సరస్సు సందర్శకుల కళ్ళకు విందు చేస్తాయి . ఇది మనదేశంలో అత్యంత ప్రాచీనమైన వాటర్ బర్డ్ శాంక్టురీప్రభుత్వం కంటే గ్రామస్తులే ఎక్కువ సంరక్షిస్తూ ఉంటారు. ఇక్కడి భ్యారింగ్ టోనియా వృక్షాలు అనేక వలస పక్షులకు నివాసంగా ఉంటాయి . సీజన్ లో కనీసం 18 రకాల పక్షులు ప్రపంచం నలుమూలల నుంచి ఇక్కడకు చేరుకోంటాయి . స్పటిక్ బిల్డ్,లేదా గ్రే పెలికాన్లు ,రూట్స్ బ్లాక్ వింగడ్ స్టిల్డ్స్ వంటివి వేదాంత గాళ్ ను సందర్శించే పక్షులు ఉన్నాయి . ఈ పక్షులకు ,తమ పంటల ఉత్పత్తికి నడుమ గల బాంధవ్యం అర్ధం చేసుకొని గ్రామస్తులు వీటిని ఎంతో శ్రద్దగా చూస్తారు . చెన్నయ్ నుంచి జాతీయ రహదారిలో ఇక్కడకు వెళ్ళవచ్చు .