డిజైనర్ డ్రస్ తో ధరించి ర్యాంప్ వాక్ చేయటం,మోడలింగ్ నా వృత్తి . నేను నటిని అయ్యాను అంటే మోడలింగ్ కదా ప్రధాన కారణం.ర్యాంప్ వాక్ చేస్తుంటే అందరూ మెచ్చుకొనేవాళ్ళు. డ్రస్ ల వల్ల నాకు అందమా ? లేదా నావల్ల డ్రస్ లకు అందమా ?అనే వాళ్ళు .అదిగో అలాంటి ప్రశంసలే నన్ను ది గ్రేట్ మణిరత్నం దగ్గరకు చేర్చాయి అంటోంది డయానా ఎరప్ప. నవాబ్ సినిమాతో పరిచయం అయినా అందమైన మోడల్ .మణిరత్నం గారి సినిమాలో హీరోయిన్ అవటం అంటే మాటలు కాదు. ఆయన పరిచయం చేసిన హీరోయిన్ లు ఎంతో పెద్దస్థాయికి వెళ్ళారు. అలాంటి అదృష్టం నాకు వస్తుంది. మొదటి రోజు షూటింగ్ కు వెళితే అందరూ సీనియర్లే.నేనేమో పూర్తిగా కొత్త .కాస్త తడబడి టేకులు ఎక్కువే తీసుకొనేదాన్ని .కానీ అందరూ విసుక్కొకుండా చాలా చక్కగా అన్నీ చెప్పి ప్రోత్సహించారు . నేను హీరోయిన్ అయిపోయాను అంటోంది డయానా ఎరప్ప.
Categories