బహుమూలల్లో, మోచేతులు, పాదాల పై నలుపు దనం గనుక వుంటే ఆ ప్రాంతమలో మ్రుతకణాలు తొలగించి చర్మాన్ని యధాస్ధితికి తెచ్చుకోవాలంటే ఈ కాంబినేషన్స్ ట్రయ్ చేయొచ్చు. గులాబీ నీరు చందనం పొడి ముద్దగా చేసి ఆ మిశ్రమాన్ని నల్లగా వున్న చొట  రాసి పది నిమిషాల తర్వాత కడిగేయాలి  రోజు ఇలా చేస్తే నలుపు పోతుంది. రెండు చంచాల తేనె నిమ్మరసం కుడా మంచి చిట్కా. కమలా పండు తొక్కల పొడి గులాబీ నీరు కలిపి ముద్దలా చేసుకుని కాసేపు అయ్యాక కడిగేస్తే నలుపు దనం  పోతుంది. ఈ చిట్కా వంటి రంగు మెరుగు పెట్టుకునేందుకు ఎంతో బాగా పనిచేస్తుంది. సున్ని పిండి లో కమలా తొక్కల పొడి, గులాబీ నీరు కలిపి నలుగు పెట్టుకున్నా ప్రతి రోజు వంటికి రాసుకుని స్నానం చేసినా మంచి ఫలితం.

Leave a comment