మెట్రో నగరం లోని ఇళ్ళల్లో ఎయిర్ ప్యూరి ఫయర్లు వాడాల్సిన అవసరం వుందని అద్యాయినాలు చెప్పుతున్నాయి. నగరాల్లో రోజు రోజుకు వాయు కాలుష్యం పెరిగిపోతుంది. ఇరుకు ఇళ్ళు కార్పరేట్ ఆఫీసుల్లో సెంట్రల్ ఎ.సి ల్లో గంటల తరబడి పని చేయడం కూడా అనారోగ్య కారణమే. బయటి వాతావరణంలో కలుషితమైన గాలి ఎక్కువవుతోంది. కానీ బయట వాతావరణంలో విడుదలయ్యే కలుషితం కన్నా ఇండోర్ లో వెలువడే కలుషిత వాయువులే ఊపిరి తిత్తులను పాడు చేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం గాలి లో నాణ్యత తగ్గిపోతుంది. అగర్బత్తీల పొగ, దోమల కోసం వాడే కాయిల్స్ లిక్విడ్ ల గాలి, కార్పెట్లు, కర్టిన్ల దుమ్ము, ధూళి, దుమా పానం వంటివన్నీ ఇందుకు కారణం అవుతున్నాయి. వీటి వల్ల పిలల్లో, వృద్దుల్లో అనారోగ్యం సమస్యలు ఎక్కువవుతున్నాయి. అందుకే ప్యూరి ఫయర్లు అవసరం అంటున్నాయి అధ్యయనాలు. అలాగే కుండీలలో అయినా సరే గాలి సుద్ధి చేసే శక్తి వున్న మొక్కల పెంపకం చేపట్టమంటున్నారు.
Categories