చలి రోజుల్లో వచ్చే ప్రధాన సమస్య చర్మం పొడిబారి పోవడం ,జుట్టు గడ్డిలాగా తయారవటం . ఈ సమస్యలకు చక్కని పరిష్కారాలున్నాయి . గోరువెచ్చని నీళ్ళలో కాసిన పాలు పోసి ఆ నీళ్ళతో స్నానం చేస్తే పాలలోని సహజసిద్ధమైన లాక్టిక్ గుణాలు చర్మాన్ని మెరిపిస్తాయి . షాంపూకి బదులుగా శీకాయ పొడి లేదా కుంకుడు కాయతో తలస్నానం చేస్తే శిరోజాలు సహజమైన నూనెలు పోగొట్టు కోకుండా ఉంటాయి . స్నానం చేసిన వెంటనే మాయిశ్చ రైజర్ రాసుకోవాలి . మేకప్ లో బ్లెస్ వంటివి పొడి రూపంలోవి కాకుండా క్రీమ్ రూపంలో ఉన్నవి వాడుకోవాలి . మస్కారా ఐ లైనర్ వంటివి వాటర్ ప్రూఫ్ రకం ఎంచుకొంటే చలిగాలులు మేకప్ పాడయి పోకుండా ఉంటుంది .

Leave a comment