Categories
ప్రతి పన్నెండు సంవత్సరాల కొకసారి జూన్ నెలలో జనిషికార్ కు బయలుదేరుతారు చత్తీస్ ఘడ్ ఆదివాసి మహిళలు. బావరాన్ లేదా కురుక్ తెగకు చెందిన ఆదివాసి మహిళలు తమ తెగ ప్రజలను కాపాడు కోవడం కోసం దండయాత్రకు తెగబడిన శత్రువులతో వీరోచితంగా పోరాడే విజయం సాధించినందుకు గుర్తుగా ఇప్పటికీ ఈ వేడుక జరుపుకుంటారు. ఆ రోజుల్లో మొత్తం మూడు యుద్ధాలు చేసిన గుర్తుగా మహిళలు నుదుటిమీద కొలిమి తో కాల్చిన ఇనుప ముక్కల గుర్తులు పెట్టుకున్నారట. అలనాటి సాహసానికి గుర్తుగా కురుక్ తెగ మహిళలు ఇప్పుడు అదే గుర్తును పచ్చబొట్టు రూపం లో ధరిస్తూ ఉంటారు. ప్రస్తుతం సాంప్రదాయ జనిషికార్ లో భాగంగా మహిళలు పురుషుల దుస్తులు వేసుకుని ఆయుధాలు ధరించి ఇరుగు పొరుగు గ్రామాలకు వెళతారు.