Categories
కొవ్వు తీయని పాలు అనారోగ్యం అని సాధారణంగా వెన్న తీసిన పాలే తాగుతారు . కానీ అమెరికా యూనివర్సిటీ పరిశోధకులు పాల ద్వారా లభించే కొవ్వు ఆరోగ్యానికి మంచి చేస్తుందని చెపుతున్నారు . మూడువేల మంది పైన సుదీర్ఘకాలం పరిశోధన చేసిన అనంతరం ఈ విషయం వెల్లడించారు . కొవ్వు తీయని పాలు తాగిన వారిలో అధిక బరువు ఏమి కనిపించలేదు పైగా మధుమేహం వచ్చే అవకాశం 40 శాతం తక్కువగా ఉన్నట్లు చెపుతున్నారు . అయితే పాలతో పాటు కార్బోహైట్రేట్లు ఎక్కువ వుండే ఆహారం తీసుకొనేందువల్ల శరీరంలో అసలు కదలికలు లేని జీవన శైలి అవలంబించటం వల్లనే ఆరోగ్యం ముప్పు ఉంది, కానీ వెన్నతో కూడిన పాల వల్ల ఎలాంటి నష్టం లేదంటున్నారు .