ఫ్యాషన్ ట్రెండ్స్ లో తెలుపు కు ఎంతో ప్రాధాన్యం వుంది. సరైన యాటిట్యూడ్ లో సరైన కలర్ స్క్రీమ్ తో స్టయిల్ గా ధరిస్తే గ్లామర్ పవర్ కూడా సొంతం అవుతుంది. సృజనాత్మకమైన రూపానికి తెలుపు కాన్వాస్. తెల్లని డ్రెస్ లేదా చీర ఉద్యోగ ప్రదేశంలో క్లీన్ ప్రొఫెషనల్ లుక్ ఇస్తుంది. తెల్లని వస్త్రధారణ కు యాక్సిసరీస్ ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి. భారీగా ఉండాలనుకుంటే ఎరుపు నేవీబ్లూ మేజెంటా వంటి బెల్టుల హీల్స్ క్లచెప్ నెక్‌పీస్ ల రూపంలో జత చేసుకోవాలి. సింపుల్ గా కనిపించాలంటే సిల్వర్ గ్రే బ్రౌన్ గోల్డ్ చీజ్ క్యామెజ్ వంటి రంగులు జోడించాలి. గోల్డ్ సిల్వర్ బ్రాంజ్ వంటి మెటాలిక్ కలర్స్ తెల్లని దుస్తులకు బాగా నప్పుతాయి. సిల్వర్ ముత్యాల నగలు బావుంటయి . తెల్లని వస్త్రశ్రేణి ఎంపికలో ట్రాన్సఫరెన్సీ కి ప్రాధాన్యత ఇవ్వాలి. క్లాత్ వెనక చేయిపెట్టి చుస్తే ఫ్యాబ్రిక్ ట్రాన్స్ ఫరెన్సీ అర్ధంఅవుతుంది. లోదుస్తులు ఎంపికలో శ్రద్ధ తీసుకోవాలి. సరైన రంగు ఎంచితీసుకోవాలి . ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే తెల్లని ఏ సమయంలో నైనా అందంగా ఉంటాయి.
Categories