Categories
వేసవిలో శరీరానికి ఎలక్ట్రో లైట్స్ అందాలి అంటే పోటాషియం, కాల్షియం, సోడియం బై కార్బోనేట్ , సోడియం క్లోరైడ్ వంటి పానీయాలు అందాలి. కొబ్బరి నీళ్ళలో ఎలక్ట్రో లైట్స్ అందుతాయి. నిమ్మ,నారింజ, కమలా, ద్రాక్షా అల్లం రసం కూడా ప్రయోజనకరం. నరాలు సక్రమంగా పని చేస్తూ గుండే పదిలంగా ఉండాలి అంటే ఉప్పు కలిపిన పంచదార నీరు తక్షణ ఉపశమనం గా తాగాలి. కీర దోసలు, పొటాషియం, మంగానీస్, మెఘ్నీషియం ఎక్కువగా ఉంటాయి. కీరదోస రసం, సబ్జా గింజల పానీయం రెండు వేసవికి ఉపశమనాలే, ఎండల్లో స్వేదం అధికంగా పోతే శరీరం నీరసపడకుండా ఈ పానీయాలు కాపాడతాయి.