Categories
![](https://vanithavani.com/wp-content/uploads/2022/04/aam-panna-juice1.jpg)
ఇప్పుడు పచ్చిమామిడికాయలు పుష్కలంగా వస్తున్నాయి వీటితో రుచిగా ఉండే ఆమ్ పన్నా జ్యూస్ తయారు చేసుకోవచ్చు. రెండు పచ్చి మామిడి కాయలు, ఒక స్పూన్ పంచదార, నల్ల ఉప్పు, ఒక స్పూన్ ఉప్పు, టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక స్పూన్ పుదీనా ఆకులు ఐస్ క్యూబ్ తీసుకోవాలి. ముందు మామిడికాయలు కుక్కర్ లో మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. చల్లార్చిన తర్వాత పై తొక్కు తీసి వేయాలి. ఇప్పుడు మిక్సీలో మామిడికాయల గుజ్జు, పంచదార, ఉప్పు, నల్ల ఉప్పు, జీలకర్ర పొడి వేసి గ్రైండ్ చేసుకోవాలి. పుదీనా ఆకులతో గార్నిష్ చేసుకుని ఐస్ క్యూబ్స్ వేసి చల్లగా సర్వ్ చేసుకోవాలి .