పురచ్చితలైవిగా తమిళ ప్రజలు ప్రేమగా పిలుచుకునే తమిళనాడు ముఖ్యమంత్రి అన్నా డి. ఎం. కె అధినేత్రి జయలలిత సోమవారం రాత్రి తుది శ్వాస వదిలారు. కర్ణాటకా లోని తమిళ అయ్యంగార్ కుటుంబంలో జన్మించిన జయలలిత తల్లి తల్లి సినీనటి. ఆమె ప్రోత్సాహంతో సినిమాల్లోకి అడుగు పెట్టిన జయలలిత తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 140 సినిమాల్లో నటించారు. ఆమెను తమిళనాడు ప్రభుత్వం కలై మామణిపురస్కారం తో సత్కరించారు. 1981 లో రాజకీయాల్లోకి వచ్చారు జయలలిత. 83 నుంచి 89 వరకు రాజ్యసభ సభ్యురాలిగా పని చేసారు. 43 సంవత్సరాల వయస్సు లోని ఆమె తమిళనాడు సి.ఎం గా పదవీ బాధ్యతలు స్వీకరించి రికార్డు నెలకొల్పారు. తమిళ సామ్రాజ్ఞి జయలలిత బీదబడుగు బలహీన వర్గాల ఆశాద్వీపం అయ్యారు. లెక్కలేనన్ని అమ్మాపధకాలకు శ్రీకారం చుట్టి ప్రజిత మనస్సుల్లో తిరుగులేని స్థానం సంపాదించారు. అనారోగ్యం రెండునెలలకు పైగా మృత్యువు తో పోరాడిన జయలలిత కన్నుముసరు. అనారోగ్యంతో రెండు నెలలకు పైగా పోరాడిన జయ లలితా కన్ను ముసరు. ఆమె మరణంతో దేశ రాజకీయాల్లో పెద్ద శూన్యం ఏర్పడిందన్నారు మోడీ. ప్రజలతో ఆమె మమేకమైన తీరు, అణగారిన వర్గాల పట్ల ఆమె తపన తనకు స్ఫూర్తి దాయకం అన్నారాయన. విప్లవ నాయికి జయలలిత మృతి తో దేశ రాజకీయాల్లో ఓకే సఖం ముగిసింది.
Categories