Categories
ఫ్యాషన్ వస్త్రధారనలో భాగంగా బ్లౌజ్ ,లెహాంగాలు ,బ్యాగ్ ,లెస్ టాప్లో ధరించవలసి వస్తే వీపు భాగంపై ట్యూన్ పొంకులు,మరకలు కనిపిస్తే స్టైల్, ఫ్యాషన్ రెండు పోతాయి. స్నానం చేసే సమయంలో క్రమం తప్పకుండా స్క్రబ్బింగ్ చేస్తూ ఉంటే మృత కణాలు పోయి చర్మం మృదువుగా ఉంటుంది. మన వంటగదిలోంచే స్క్రబ్ లు తయారు చేసుకోవచ్చు. కళ్లుప్పుని బేకింగ్ సోడాతో కలిపి స్క్రబ్ గా ఉపయోగిస్తే మెడ,వీపుపై చర్మం బావుంటుంది. నిమ్మరసంలో మీగడ ఓట్ మీల్ పొడి కలుపుకొనే ఈ మిశ్రమాన్ని మెడ,వీపుభాగానికి అప్లైయ్ చేసి పావుగంటాగి కడిగేస్తే చాలు . ఏదైన ప్రత్యేక సంధర్భాల కోసం వీపుపై మచ్చలు ,గీతలు,కవర్ చేసేందుకు లిక్విడ్ కన్సీలక్ ఉపయోగించి తర్వాత బాడీ ఫౌండేషన్ తో కవర్ చేస్తే సరిపోతుంది.