Categories
కరోనా భయం తో వాకింగ్ కోసం,జాగింగ్ కోసం బయటికి వెళ్లి వ్యాయామం చేయాలన్న భయంగానే ఉంటుంది కనుక ఊపిరి తిత్తుల సామర్ధ్యాన్ని పెంచేవి వ్యాధినిరోధకతకు ఉపయోగపడే వ్యాయామాలు ఇంట్లోనే కూర్చొని,పడుకొనే చేయండి అంటున్నారు లైఫ్ స్టైల్ అండ్ వెల్ నెస్ ఎక్సపర్ట్స్. నిలబడే చేసే బెల్లీ బ్రీతింగ్ బోర్లాపడుకొని చేసే బ్రీతింగ్ స్ట్రెంటెనింగ్ ఎక్సర్ సైజెస్ చేయ మంటున్నారు. నిలుచున్న చోటే కదిలిస్తూ స్టాటిక్ వాకింగ్ చేయమంటున్నారు. ఆయాసం రానంత సేపు ఈ వ్యాయామం చేయాలి. ఊపిరి తిత్తుల నిండా గాలి పీల్చుకొని వీలైనంత ఎక్కువ సేపు దాన్ని లంగ్స్ లో నిలపాలి. తరువాత నెమ్మదిగా వదలాలి ఈ డీప్ బ్రీతింగ్ ఎప్పుడు పడితే అప్పుడు చేయచ్చు ఈ వ్యాయామాలు అన్ని యూట్యూబ్ లో చూడచ్చు.