బాదం గింజలు మొహాన్ని మెరిపిస్తాయి  అంటున్నారు ఎక్సపర్ట్స్. విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే బాదంపప్పులు అందానికి మెరుగులు దిద్దు తాయి. ఐదు బాదం గింజలు నాననిచ్చి బరకగా పేస్ట్ చేసి అందులో రెండు స్పూన్ల తేనె అర చెంచా పాలు కలపాలి ఈ మిశ్రమంతో మొహానికి స్క్రబ్ చేయాలి. అరగంట తర్వాత కడిగేసుకోవాలి ఇలా చేయడంతో మృతకణాలు తొలగిపోయి చర్మం నునుపుగా అయిపోతుంది.అలాగే నానబెట్టి మెత్తగా రుబ్బిన బాదం గింజల పేస్ట్ లో ఒక స్పూన్ శనగపిండి కొద్దిగా పెరుగు కలిపి ఆ మిశ్రమం తో మొహానికి ప్యాక్ వేసుకోవాలి. కాస్త ఆరిపోయాక వేళ్ళను తడిచేసుకుని మొహం పై మర్దన చేస్తే చాలు ముఖం తేటగా తాజాగా ఉంటుంది.

Leave a comment