ప్రత్యేక సందర్భాల కోసం ఖరీదైన బరువైన వస్త్రాలే కాదు తేలికైన సిల్క్ క్రేప్ ,జార్జెట్ వంటి వస్త్రాలు కూడా సరైన తరహాలో డిజైన్ చేయిస్తే చక్కని లుక్ లో ఉంటాయి. ఉదాహరణకు ధోతి స్టైల్ కుర్తీ మీదకు పెప్లమ్ టాప్ ని కుట్టించుకొంటే ఎంతో అందం. జార్జెట్ ,కాటన్ సిల్క్ వంటివి రెండు తరహా వస్త్రశ్రేణి లో ఈ డ్రెస్ ఉంటే బావుంటుంది. కాలేజీ వేడుకలకు హై అండ్ లో మంచి పాటర్న్ అలాగే ఒక సాధారణ కుర్తీ ఎసెమెట్రికల్ కట్ తో కుట్టించేసి ,స్లీవ్స్ తో రఫుల్స్ వేసుకొంటే బావుంటుంది. లాంగ్ గౌన్ కు గేరా తో పాటు అడుగు భాగంలో అంచులతో రపుల్ ని కుట్టించుకొంటే చక్కగా ఉంటుంది. అలవాటైన సింపుల్ లుక్ తోనే స్టైల్ గా కనిపించానుకొంటే ఎరుపు,నీలం,ఆకుపచ్చ వంటి రోటీన్ రంగులు కాకుండా వేరువేరు పేస్టల్ రకాలను కలుపుకొంటే పూర్తిగా లుక్ మారిపోతుంది.
Categories