అంతరిక్షంలో ముగ్గురు అబ్బాయిల బృందంలో ప్రయాణం చేసే మహిళ వ్యోమగామి పాత్ర నాది. ఈ పాత్ర కోసం తీగల సాయంతో వేలాడితే ,వెనక్కి తిరిగి ఫల్టీ కొట్టటం గాలిలో తేలుతూ స్టంట్స్ చేయటం వంటి వాటిలో శిక్షణ తీసుకొన్న . అంతరిక్ష సెట్లో గంటల తరబడి రోప్స్ పట్టుకొని వేలాడాల్సి వచ్చింది. కథనాయిక అంటే కేవలం అందం కానేకాదు. ఎలాంటి పాత్ర చేసినా ప్రేక్షకుల మనసులో స్థానం దక్కించుకోవాలి.అందుకై ఎంతైనా కష్ట పడాలనిపిస్తోంది అంటోంది అదితి రావ్. నటిగా ప్రతి సినిమాకు ఏదో నేర్చుకొంటూనే ఉన్న . పాత్ర నిడివి గురించి ఎప్పుడూ ఆలోచించను ,నాయక పాత్రలు, గ్లామర్ పాత్రలు అని రూలేం లేదు. నేను నటిగా నిరూపించుకోవటం కోసం నా తాపత్రయం అంతా అంటోంది అతిది రావ్.

Leave a comment