Categories
WhatsApp

ఇంటి భోజనం తీసుకుపోవడం బెస్ట్.

ఆఫీస్ కు భోజనం తిసుకుపోకుండా, భోజనానికి ఇంటికి కూడా రాకుండా, సాయంత్రం దాకా అక్కడే పడి వున్నా ఎందుకు బరువు పెరుగుతున్నామో అర్ధం కవడం లేదంటారు కొందరు. వ్యాయానికి ఆఫీసు లో తోటి వాళ్ళతో కబుర్లలో పడి అవసరం అయిన దానికంటే ఎక్కువే తినేస్తారు. ఆఫీస్ కాంటీన్ లో దొరికే స్నాక్స్, కాఫీలు, ఇతర పానీయాలు కడుపులో పడుతూనే ఉంటాయి. అలాగే చాలాసేపు ఊరికే కబుర్లు, ఏ కాఫీనో తాగుతూ రిలాక్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ. అలా కాకుండా ఇంటి నుంచి, పండ్లో, డ్రై ఫ్రూట్స్ తెచ్చుకుంటే అనారోగ్యకరమైన తిండి తినే అవకాశం వుండదు. ఆఫీస్ కు తీసుకుపోయే బాక్స్ లో పరిమితంగా పోషకాలతో నింపుకుని వెళితే ఏ సమస్యా రాదు. బయట తినే ఫుడ్ లో విపరీతమైన నూనె క్యాలరీలు కడుపులోకి చేరే అవకాశం వుంటుంది. బరువు పెరగడానికి ఇదే కారణం.

Leave a comment