Categories
Wahrevaa

ఆరోగ్యాన్ని దాచుకున్న యాపిల్.

నిగనిగలాడుతూ ఆకర్షించే యాపిల్ ను చేతిలో వుంచుకుంటే మనస్సు చాక్లెట్లు, స్వీట్లు వైపుకు లాగకుండా వుంటుంది. ఆరోగ్యవంతమైన రుచికరమైన ఈ పండ్ల వల్ల తక్షణ ప్రయోజనాలు ఎన్నో వున్నాయి. ఇందులో వుండే పీచు ప్రోటీన్ రూపంలో వుంటుంది. ఇది కరిగే స్వభావం కలది. పుష్కలంగా వుండే ఫైబర్ మూలంగా పొట్ట నిండుగా సంతృప్తిగా వున్న ఫీలింగ్ కలుగుతుంది. షుగర్, శుద్ధి చేసిన ధాన్యం కలిగినంతగా ఇందులో వుండే ఫైబర్ త్వరగా కరగదు. యాపిల్ పైన వుండే తొక్కలో ఎక్కువ ఫైబర్ వుంటుంది. ఇందులో యార్బోలిక్ యాసిడ్ వుంటుంది. దీని వల్ల వుబకయం రిస్క్ తక్కువగా వుంటుంది. ఊపిరి తిత్తులు పని విధానం బాగు చేస్తుంది. ఒక మాదిరి యాపిల్ లో ప్రతి రోజు తీసుకోవాల్సిన సి విటమిన్ లో 14 శాతం వరకు వుంటుంది. యాపిల్, పియర్స్, బ్లూ బెర్రీస్లో టైప్-2 షుగర్ రిస్క్ తగ్గించే గుణాలున్నాయని ఇటీవల పరిశోధనలు తెలిపాయి.

Leave a comment