ఘాటుగా,వగరుగా,కారంగా ఉండే వంటలకు వామూతో ఒక ప్రత్యేకమైన రుచి వస్తుంది.చాలా మంది వామూను ఎక్కువగా వాడరు గానీ ఇందులో ఔషధగుణాలు అపారంగా ఉంటాయి. కాస్త వాముని వేయించి,రాత్రంతా నీళ్ళలో నాననిచ్చి ,ఆ నీళ్ళతోనే వాముని మరిగించి ఆ నీళ్ళు తాగితే జీర్ణ సంబంధమైన అనారోగ్యాలు అన్ని పోతాయి. వామూలో ఉండే థైమల్ అనే రసాయనం ఫంగల్ బాక్టీరియా వ్యాధులను నిరోధించగలదు. ఆయుర్వేదంలో వామూకు ప్రాధాన్యత చాలా ఎక్కువ. వీటిలో మినరల్స్ ,విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్స్ ఫైబర్ చాలా ఎక్కువ.వామూ వేయించి పొడి చేసి అన్నంలో నేతితో కలిపి తింటే ఎన్నో అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది.

Leave a comment