పట్టులాంటి జుట్టు కోసం కొబ్బరి నూనె తో హెర్బల్ ఆయిల్ తయారు చేసుకోవచ్చు. ఈ నూనె జుట్టును మెరిపిస్తుంది. కుదుళ్ళు  గట్టిపరుస్తుంది.  మందారం పువ్వులు 20, వేపాకులు 30, కరివేపాకు 30, చిన్న ఉల్లిపాయ, కలబంద కొమ్మ, సన్నజాజి పువ్వులు, కొబ్బరి నూనె లీటర్లు తీసుకోవాలి కలబంద చిన్న ముక్కలుగా కోసి మిగతా ఆకుల్ని కలిపి మిక్సీలో పేస్టులాగా తయారుచేసి ఆ మిశ్రమాన్ని కొబ్బరి నూనెలో కలపాలి కొబ్బరి నూనె ఆకుల మిశ్రమాన్ని చిన్న మంటపైన ఒక 45 నిమిషాలు మరగనిస్తే నూనె ఆకుపచ్చగా మారుతుంది కొబ్బరి నూనె చల్లారిన తర్వాత వడపోసి సీసాలో భద్రపరుచుకోవచ్చు. ఈ హెర్బల్ ఆయిల్ జుట్టు నిండుగా పెరిగేలా చేస్తుంది.

Leave a comment