Categories
Wahrevaa

పండ్లతో పాటు గింజల్ని కూడా నమలాలి.

మాములుగా ద్రాక్ష పళ్ళు తింటూ పొరపాటున గింజ నోట్లో కొస్తే దీన్ని జాగ్రత్తగా వుసేస్తాం. కానీ పరిశోధనలు ఏం చెప్పుతున్నాయి అంటే ద్రాక్ష గింజల్లో అలిగోమెరిక్ ప్రోయాంధో సయనడిన్ అనే శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా వున్నాయంట. ద్రాక్షగింజ తిన్నాము అంటే కాన్సర్ ను దూరంగా తరిమేసము అని అర్ధం. ద్రాక్ష గింజల్లో వుండే ప్రోయాందో నయినడిన్స్ రక్త నాళాల చివర వుండే రక్త కేళ నాళికల ఆరోగ్యం బావుందేలా చేస్తాయి. ద్రాక్ష గింజలు చేసే ఈ అద్భుతాలు 2009 లో ది జర్నల్ ఆఫ్ న్యూట్రిషియన్ లో నమోదు చేసారు. ద్రాక్ష గింజల్లో విటమిన్-E ఫ్లేవనాయిడ్స్ లినోలిక్ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. మహిళల్లో అవి సమర్ధవంతంగా పని చేస్తాయి. ఇప్పుడిక ద్రాక్ష పళ్ళు తింటున్నప్పుడు గింజల్ని కూడా కొన్ని తినే ప్రాక్టీస్ చేయడం మంచిదే కదా.

Leave a comment