ప్లాస్టిక్ కంటెనర్లు నీట్ గా వాసనా రాకుండా వుండాలంటే గోరు వెచ్చని నీళ్ళలో నాలుగు టేబుల్ స్పూన్లు బేకింగ్ సోడా కలిపి ఆ నీళ్ళలో ముందు నానపెట్టి ఇంకా వాసనా వదలకుంటే వాటిని తుడిచి లోపల న్యూస్ పేపర్ ముక్కలు వుంచి మూతబిగించి ఓ రోజంతా ఆలా వదిలేయాలి. కాగితం వాసనా పీల్చేస్తుంది,వేడి నీళ్ళలో వాష్ లిక్విడ్ కలిపి ఆ నీళ్ళలో కడిగి ఆరబెట్టాలి. మూతలపైన మారకలుంటే గోరు వెచ్చని నీళ్ళలో లిక్విడ్ క్లోరిన్ కలిపి ఆ నీళ్ళలో మూతలు గిన్నెలు పడేసి ఓ అరగంట ఆగి శుభ్రం చేస్తే సరి ,వీటిని ఎపుడు తడిగా వుండే గా మూతలు పెట్టకూడదు.

Leave a comment