రెడ్ టీ పేరులో టీ ఉంది కానీ ఈ రెడ్ టీ ఆకుకీ తేయాకుకీ సంబంధం లేదు. దక్షిణాఫ్రికా లో ఎక్కువగా పెరిగే రాయ్ బస్ అనే మొక్క ఆకుల్నీ ఎండబెట్టి చేస్తారు.ఇది చూసేందుకే కాదు చక్కని ఆరోగ్యం కూడా ఇస్తుంది. కెఫిన్ లు లేని ఈ టీలో టానిన్ల శాతం తక్కువ.వీటిలోని ఫాలిఫినాల్స్ ను శరీరంలో విడుదల అయ్యే హానికర ప్రీరాడికల్స్ ను నిర్మూలిస్తుంది.వృద్దాప్యాన్ని అడ్డుకొంటుంది. తల నొప్పి నిద్రలేమి అస్సలు ఎగ్జిమా ఎముకల బలహీనత హైపర్ టెన్షన్ అలర్జీలను ఈ రెడ్ టీ తగ్గించగలుగుతుంది. కేవలం ఉత్సాహాన్ని ఇచ్చే టీ గానే భావస్తాము కానీ వీటిల్లో ఉండే ఆరోగ్యప్రయోజనాలు ఎక్కువ.

Leave a comment