సమంత ఎప్పుడూ సోషల్ మీడియాలో బోల్డ్ గానీ మాట్లాడుతూ ఉంటుంది. పెళ్లి కబుర్లు ప్రేమ ఇష్టమైన పనులు అన్నీ పంచుకుంటూ ఉంటుంది. ఈ కొత్త సంవత్సరం కూడా తన మనసులో మాటలు చెపుతూ ఈ సంవత్సరం ఐదారు సినిమాలు చేయాలనుకుంటున్నా. లక్ తో పాటు హార్డ్ వర్క్ నన్ను ఈ స్థాయికి తెచ్చింది. నిజమైన సంతోషం నా అనుభవం లోకి వచ్చింది. సహనం బాగా పెరిగిందీ. ఈ ఏడాది సినీ ప్రపంచం బయట పనులు కొన్ని పూర్తి  చేస్తానని చెపుతోంది హీరోయిన్  సమంత. తనకు ఫిట్ నెస్ అంటే జీవితంలో ఒక భాగం అంటుంది. హెల్తీ డైట్ ప్రాపర్ వర్కవుట్స్ ఇవే ఫిట్ నెస్ సీక్రెట్స్. ఈ సంవత్సరం నేను ఆరడుగుల ఏతయ్యానాని చిలిపిగా చెప్పింది. ఎలా అంటే ‘అఆ ‘ ‘తెరి ‘ సినిమాల విజయం కొన్ని రోజుల పాటు తను ఎంతో  ఎత్తుగా ఉన్నట్లు ఫీలయ్యేట్లు చేశాయన్నది సమంత. ఎంతోమంది ఎంత  సాధించినా  మన ఇంట్లో  మామూలు ఆడపిల్లలాగే సరదాగా సందడి చేస్తూ వుంటారు. ఆలా వుండే వాళ్లలో సమంత కూడా ఉంటుంది.

Leave a comment