విశ్రాంతి లేని గంటల తరబడి ఉద్యోగపు పని యువతలో వత్తిడి పెంచుతుంది. ఈ వత్తిడి ఆందోళన జీవితంలో సంతోషాన్ని దూరం చేయడంతోపాటు శృంగార కాంక్ష కూడా తగ్గిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.తాజా పరిశోధనలు డార్క్ చాక్లెట్ తినే అలవాటు చేసుకోవాలి అంటున్నాయి. మెదడులో డోపమైన్ శాతాన్ని పెంచడం ద్వారా లైంగిక ఆరోగ్యానికి దోహదపడుతుంది అంటున్నారు. సుమారు 14రోజుల పాటు డార్క్ చాక్లెట్ ని రోజుకి 40 గ్రామలుగా తీసుకుంటే ఒత్తిడి కలిగించే కార్డిసాల్ శాతం తగ్గి ఆనందాన్ని ఇచ్చే డోపమైన్ పెరుగుతుంది. అలాగే బ్లడ్ ప్రెజర్ తగ్గిపోతుంది. ఇది అద్భుతమైన మెడిసిన్ అంటున్నారు.

Leave a comment