ఈ వింటర్ సీజన్ కు పర్ ఫెక్ట్ డ్రస్ షర్ట్ విత్ లెహంగా అంటున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. సిల్వర్ డాట్స్ ఉన్న షర్ట్ ఎలాంటి కలర్ లెహంగా కైనా సరైన లుక్ వస్తుంది. అలాగే చక్కని పట్టు లేదా ప్రింటెడ్ లంగా అయినా సరే షర్ట్ జతచేస్తే అది కంఫర్ట్ గా స్టైల్ గా ఉంటుంది. వెస్ట్రన్ స్టైల్ షర్ట్ ఇండియన్ స్టైల్ లెహంగా ఈ రెండు కలిస్తే ఇండో వెస్ట్రన్ స్టైల్ అయిపోయి ఇది క్యాజువల్ వేర్ గా వెస్ట్రన్ పార్టీవేర్ సంప్రదాయ వేడుకల్లో డిఫరెంట్ లుక్ ఇస్తుంది.లెహంగా కి మ్యాచ్ అయ్యేలా జరీ అంచును షర్ట్ అంచుగా జత చేస్తే అది వేడుకకే హైలెట్. ఈ కాలర్ షర్ట్ మంచి పరికిణికి చక్కని గ్రాండ్ దుపట్టా వేసుకుంటే రాయల్ లుక్ తో కనిపించవచ్చు.

Leave a comment