Categories
పాత ఇనుము ఇతర లోహాలతో కలిపి తయారు చేసే యాంటిక్ వస్తువులు నగరవాసులు ఇష్టపడతారు.ఇవి గిరిజనుల సంప్రదాయ కళల్లోంచి వచ్చినవే . ప్రకృతిలో దొరికే ఎన్నో పదార్ధాలతో అందమైన బొమ్మలు చేటయం ఒక సహజమైన కళగా గిరిజనుల్లో కనిపిస్తుంది. చత్తీస్ ఘడ్ లోని గిరిజనులు తమ తెగ పెద్దల నుంచి నేర్చుకొన్న ఈ కళను మ్యూజియంలో శాశ్వతం చేశారు. వాయిద్య బృందాలు, ఊరేగింపులు ఇంకా ఎన్నో రకాల బొమ్మలు ఈ ప్రదర్శనలో కనిస్తాయి. వ్యర్థాల నుంచి అర్థవంతమైన బొమ్మలు చేస్తారు. ప్రకృతిలో దొరికే సహజమైన వర్ణాలతోనే వాటికి అలంకరణలు చేస్తారు. ప్రకృతి పట్ల గిరిజనులకున్న ప్రేమను ప్రతి ఫలిస్తాయి ఈ బొమ్మలు..