Categories
వాకింగ్ లో వర్కవుట్స్ ఆపకుండా ఊపిరి తిరగకుండా చేస్తేనే ఫలితం అనుకోవద్దు మధ్య మధ్యలో కాసేపు ఆగినా రెస్ట్ గా నిలబడ్డ సహజంగా క్యాలరీలు ఖర్చవుతాయి అంటున్నారు.తక్కువ ఇంటెన్స్ ఇంటర్వెల్స్ తో వ్యాయామాలు చేయవచ్చని కెనడియన్ పరిశోధకులు పేర్కొన్నారు. దీనివల్ల మెటాబాలిజం బాగా మెరుగవుతుందని రెండు వారాల్లో కేవలం ఆరు వర్కవుట్స్ లో కూడా 29 శాతం ఫలితాలు ఉంటాయి అంటున్నారు. 20 నిమిషాలు వర్కవుట్ చేస్తే ఎనిమిది నిమిషాలు మాములుగా సాగిస్తూ మిగతా సమయం ఎక్కువగా చేయాలన్నా ఆయాసపడిపోతూ కఠినంగా సాగిస్తేనే ఫలితం వస్తుందని అనుకోవద్దని సులువుగా సాగించే ప్రయత్నాలు చేసినా కొలెస్ట్రాల్ కరిగిపోతుంది అంటున్నారు.