64 ఏళ్ల రాధా మణి ని నడిచే గ్రంథాలయం అని పిలవచ్చు.కేరళ లోని వయనాడ్ జిల్లా లో కొండ ప్రాంతంలో ఉండే మద్దికెర మోథెక్కర గ్రామంలోని ప్రతిభా లైబ్రరీలో ఆమె పని చేస్తోంది. మహిళలలో పుస్తక పఠనం పట్ల ఆసక్తి పెంచాలనే ఉద్దేశంతో ఇక్కడ విమెన్స్ రీడింగ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించారు. ఇందులో భాగంగానే రాధా మణి వాకింగ్ లైబ్రేరియన్ గా మారి రోజూ నాలుగు కిలోమీటర్లు నడిచి చుట్టుపక్కల ఉన్న ఊర్లకు వెళ్లి ఇంటింటికి తిరుగుతూ పుస్తకాలు అందిస్తుంది. వారం తరువాత మళ్లీ వచ్చి పాత పుస్తకాలు తీసుకొని కొత్త పుస్తకాలు ఇస్తుంది.
ReplyReply allForward
|