Categories
శిరోజాల కుదుళ్లు బలంగా ఉండి జుట్టు రాలిపోకుండా ఉండాలంటే కొబ్బరి వేప ఆలివ్ నూనెలు చక్కగా పనిచేస్తాయి. అని తెలుసు కానీ ఇప్పుడా జాబిదా లో వాల్ నట్ ఆయిల్ చేరింది ఇందులోని ఒమెగా ఫ్యాటీ ఆమ్లాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మాడును ఆరోగ్యంగా ఉంచుతాయి.వాల్ నట్ లో యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ. వాల్ నట్ ఆయిల్ దెబ్బతిన్నా లేదా చిట్లిపోయిన జుట్టుకు పోషణ ఇచ్చి వాటిని బలంగా దృఢంగా మారుస్తుంది ఈ నూనెలోని పొటాషియం కొత్త కణాలు పునరుద్ధరిస్తుంది దాంతో జుట్టు నిండుగా పెరుగుతుంది.