ప్రతి చిన్న విషయానికీ వాదనకు దిగటం ఒకరు అవునంటే ఇంకొకరు కాదనటం వైవాహిక బంధంలో సర్వసాధారణం. కానీ తరచూ ఇలా వాదించుకోవటం గొడవలు పడటం ఆరోగ్యానికి మంచిది కాదని చెపుతున్నారు కాలిఫోర్నియా యూనివెర్సిటీ శాస్త్రజ్ఞులు. ఇటువంటి అర్గ్యూ మెంట్ల వాళ్ళ రోగనిరోధక వ్యవస్థ ప్రతి స్పందనకు అణిచి వేసుకున్నట్లు అవుతుందని పరిశోధకులు చెపుతున్నారు. రక్తంలో వుండే సహజ కిల్లర్ సెల్స్  శరీరాన్ని రుగ్మతలనుంచి కాపాడతాయి. అయితే ఈ ఘర్షణలు వాగ్వివాదాలు గొడవల సమయం తో ఇవి వెలికి వస్తాయి. వివాదాలు తారాస్థాయికి చేరితే వారి రక్తంలో అదనపు కిల్లర్ కణాలు ఉండాల్సివస్తాయి. ఈ తగువులతో ఆరోగ్యం సంక్షేమం తప్పనిసరిగా ప్రభావితం అవుతొందని  అధ్యయనాలు చెపుతున్నాయి.

Leave a comment