నటనకు అవకాశం ఉన్న పాత్ర వస్తే నిరూపించుకోవటం ఎంతసేపు అంటోంది రెజీనా.   ‘అ!’  సినిమాలో రెజీనా రూపానికి, నటనకు మంచి మార్కులు పడిపోయాయి.   డ్రగ్స్ కు అలవాటు పడ్డ అమ్మాయిగా బాడీ లాంగ్వేజ్ ని బాగా పండించింది రెజీనా.   ఈ పాత్రకు ప్రశంసలు ,ప్రమోషన్ కూడా తెచ్చింది రెజీనాకు.   బాలీవుడ్ లో ఏకంగా ఓ ప్రత్యేక పాత్రకు ఎంపిక అయ్యింది రెజీనా.   బాలీవుడ్ లో సోనమ్ కవూర్ ,అనిల్ కవూర్ లు నటిస్తున్న ఓ చిత్రంలో ఒక విభిన్నమైన పాత్ర కోసం అన్వేషిస్తున్న సమయంలో ఆ పాత్రకు రెజీనా సరిగ్గా సరిపోతుందని దర్శక నిర్మాతలు నిర్ణయించుకొన్నారు.   తెలుగులో ‘అ!’ సినిమా లాగే అదీ రెజీనాకు పేరు తెచ్చేదే నంటున్నారు.

Leave a comment